ఆర్జీవీ ఆఫీస్‌పై పవన్ ఫ్యాన్స్ దాడి..

153
rgv
- Advertisement -

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆఫీస్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడికి పాల్పడ్డారు. పవర్ స్టార్ మూవీ గురించి ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పవన్‌ ఫ్యాన్స్‌కు వర్మ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వర్మ చేసిన సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న పవన్ ఫ్యాన్స్‌… జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఏకంగా రాళ్లతోని కార్యాలయం పైన దాడి చేశారు. ఈ దాడిలో రామ్ గోపాల్ వర్మ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అయింది.

ఆర్జీవీ ఆఫీస్‌పై దాడి నేపథ్యంలో ఎనిమిది మంది పవన్ కళ్యాణ్ అభిమానుల పైన కేసు నమోదు చేశారు పోలీసులు.

- Advertisement -