జనసేన పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..

225
renudesai pawankalyan
- Advertisement -

జనసేన పార్టీలో చేరికపై స్పందించారు సినీ నటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్. తాను జనసేన పార్టీలో చేరడంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. జనసేననే కాదు, తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని చెప్పారు. నా గురించి జనాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన లో చేరుతున్నారా అని అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసహనం వ్యక్తం చేశారు. తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే అందులో సిక్రెట్ ఏమి ఉండదని చెప్పారు. జనసేన, వైసీపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రస్తుతం తాను కేవలం రైతుల సమస్యలపై దృష్టి సారించానని తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే పయత్నం చేస్తానని చెప్పారు. విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో పర్యటనలు ముగిసిన తర్వాత తాను హైదరబాద్ కూడా వస్తానని తెలిపారు.

రేణు దేశాయ్ ఇటివలే కర్నూల్ లో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ రైతులతో చర్చించి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే అదే రోజు కర్నూలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పర్యటించడంతో వీరిద్దిరి టూర్ పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలకు ధీటుగా ఇవాళ సమాధానం ఇచ్చారు రేణు దేశాయ్.

- Advertisement -