పవన్ అలీ గొడవ గురించి తెలుసుకున్న రేణు దేశాయ్

271
Renu deshai
- Advertisement -

కొన్ని సందర్భాలలో మంచి మంచి మిత్రులు కూడా శత్రువులవుతారు. ఇది ఎక్కువగా రాజకీయాల్లో విటుంటాం. ఇటీవల ఏపీ ఎన్నికలు మంచి స్నేహితులైన పవన్ కల్యాణ్, అలీ మధ్య చిచ్చుపెట్టాయి. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్, కమెడీయన్ అలీ చాలా క్లోజ్ అన్న విషయం తెలిసిందే. తాజాగా రాజకీయాలు వీరిద్దరి మధ్యలో గొడవలుపెట్టాయి. వైసిపిలో చేరేకంటే ముందు అలీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రి ప్రచారంలో అలీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.

అలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని, సాయం పొంది మోసం చేసిన అతన్ని చూసిన తరువాత, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ కూడా వేశారు అలీ. ఈఅంశం అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్, ఈ వ్యవహారం గురించి అలీని రివర్స్ ప్రశ్న వేశారు.

తానో సీరియస్ ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని చెప్పిన రేణూ, “మీకు, కల్యాణ్ గారికి చాలా పెద్ద గొడవైందని విన్నాను. నిజమేనా?” అని ప్రశ్నించింది. దీనికి అలీ జవాబిస్తూ..అవును గొడవ అయిన మాట వాస్తవం అని చెప్పారు అలీ. . ఇంటర్వ్యూలో తన పేరును రేవతి అనో లేదా రేవా అనో పెడితే బాగుండేదని చెప్పుకొచ్చారు. ‘జానీ’, ‘ఖుషీ’ సినిమాలకు తాను ఎడిటింగ్ చేశానని, అందుకు తనకు రూపాయి కూడా ఇవ్వలేదని, అందుకు తన మాజీ భర్త పవనే సాక్ష్యమని అన్నారు రేణు దేశాయ్. తనకిప్పుడు ఎంగేజ్ మెంట్ అయిపోయిందని, తన పెళ్లిని ఎక్కడా దాచాల్సిన అవసరం లేదని అన్నారు.

- Advertisement -