పవన్ కళ్యాణ్…వకీల్ సాబ్ !

864
pawan kalyan
- Advertisement -

వెండితెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గరి నుంచి సినిమాకు సంబంధించి రోజుకోవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ లోగోను ఉగాది రోజున రివీల్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

గతంలో పవన్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ మే నెలలో విడుదలై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అందుకే అదే సెంటిమెంట్‌ను ఫాలో అయి మే నెలలో పవన్ మూవీని విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిఉంది. ఈ సినిమా తర్వాత క్రిష్,హరీష్ శంకర్‌లతో సినిమాలు చేయనున్నాడు పవన్‌.

- Advertisement -