OG 2:పవన్ క్రేజీ అప్‌డేట్

1
- Advertisement -

డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ సాధించిన అద్భుతమైన విజయం పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానంలోనే ఒక మైలురాయిగా నిలిచింది. పవన్ కళ్యాణ్‌ చరిష్మా ,ఎమోషన్‌ను పర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేసి చూపించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ కలెక్షన్లకు అతీతంగా ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ పవన్ కెరీర్‌లోనే ఇదొక ఐకానిక్ ఫిల్మ్‌గా నిలిచేలా చేసింది.

ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్‌పై వస్తున్న వార్తలు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్ హౌస్.. ‘ఓజీ 2’ పై ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. దర్శకుడు సుజీత్ విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ‘ఓజీ 2’ కి సంబంధించిన చర్చలు జరుగుతాయని, సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని వారు ధృవీకరించారు.

ట్విట్టర్ (ఇప్పుడు X) వేదికగా ప్రొడక్షన్ హౌస్ స్పందిస్తూ.. “మాటిచ్చినట్లుగానే ఆయన (సుజీత్) చేస్తారు. ఆ సమయం ఎప్పుడనేది ఆయనే మనకు తెలియజేస్తారు. @Sujeethsign విదేశాల నుండి తిరిగి రాగానే, మేము దీనిపై చర్చిస్తాము. #OG2” అని పోస్ట్ చేసింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జపాన్ నుండి భారతదేశానికి ప్రయాణమై, సత్యనారాయణ అనే వ్యాపారవేత్తకు రక్షకుడిగా మారే ‘ఓజస్ గంభీర’ (అలియాస్ ఓజీ) అనే మాజీ సమురాయ్ చుట్టూ తిరుగుతుంది. బాంబే అండర్‌వరల్డ్‌లో తిరుగులేని గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన ఓజీ.. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు రహస్యంగా మాయమవుతాడు. మళ్లీ 1993లో అతను తిరిగి రావడం, ఆపై ప్రత్యర్థి క్రైమ్ లార్డ్ ‘ఓమి భౌ’ (ఇమ్రాన్ హష్మీ పోషించిన పాత్ర) తో జరిగే ప్రతీకార పోరాటమే ఈ సినిమా కథాంశం.

Also Read:సింగ్ గీతం..పెద్ద బ్లాక్‌బస్టర్!

- Advertisement -