అల్లుళ్లకు పవన్ కళ్యాణ్‌ అభినందనలు

525
Pawan-Kalyan-
- Advertisement -

మెగా అల్లుళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఇదేంటి పవన్ కళ్యాణ్‌ అల్లుళ్లకు అభినందనలు ఎందుకు తెలిపాడు అనుకుంటున్నారా! మెగా అల్లుళ్లు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లు నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ కావడంతో వారికి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్. వీరితో పాటు డైరక్టర్, ప్రొడ్యూసర్, సినిమా బృందాలకు ఆయన తన అభినందనలు తెలిపారు.

సుప్రిమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల..వైకుంఠపురంలో మూవీ కూడా గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఇద్దరికి పూల బోకేను పంపి విషెస్ తెలియజేశారు. ‘అల్లు అర్జున్ గారు అల వైకుంఠపురములో సినిమా మంచి విజయాన్ని అందుకుంటున్నందుకు కంగ్రాట్స్. ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లకు ఆల్ ది బెస్ట్’’ అని కామెంట్ పెట్టారు.

అలాగే గత నెలలో వచ్చి సక్సెస్ సాధించిన ప్రతిరోజు పండగే విజయాన్ని పురస్కరించుకొని సాయి ధరమ్ తేజ్‌కు బొకేను పంపారు పవన్. మామ అభినందనలు తెలపడంతో ఆనందం వ్యక్తం చేశారు బన్ని, సాయి తేజ్. పవన్ కల్యాణ్ నుంచి అభినందనలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యు పవన్ కల్యాణ్ గారు’’ అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్.

- Advertisement -