బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా

230
jp nadda

భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఈనెల 22న జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనన్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల షెడ్యూలు త్వరలోనే విడుదల అవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్ష పదవికి నడ్డానే ఏకగ్రీవంగా ఎన్నికవుతారన్న ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే అధికారకి ప్రకటన రానున్నట్లు వెల్లడించారు బీజేపీ అగ్రనేతలు. నడ్డా ఎన్నికను బీజేపీ సీనియర్‌ నేత రాధా మోహన్‌సింగ్‌ త్వరలో ప్రకటిస్తారని తెలిసింది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్రహోం మంత్రి అమిత్ షా కొనసాగుతున్నారు.

2018జులైలో జేపీ నడ్డా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ చీఫ్ లను మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఏపీ అధ్యక్ష పదవి రేసులో ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు మరోమారు వినిపిస్తుండగా పురంధేశ్వరి, మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ మాధవ్‌లు కూడా రేసులో ఉన్నారు. అలాగే తెలంగాణలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అధ్యక్ష పదవిలో ఉండగా..రేసులో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.