ఈనెల18న అల.. సక్సెస్ మీట్

531
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ..టబు కీలక పాత్రలో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈమూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , గీతా బ్యానర్స్ పై చిన్నబాబు , అల్లు అరవింద్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది. దీంతో చిత్ర బృందం ఫుల్ హ్యాపిగా ఉన్నారు.

ఈసందర్భంగా చిత్రయూనిట్ కు అందరికి తన ఇంట్లో పార్టీ ఇచ్చాడు హీరో అల్లు అర్జున్. కలెక్షన్ల పరంగా కూడా ఈమూవీ దూసుకుపోతుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈమూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని సినీ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓవర్సీస్ లో కూడా భారీగా రెస్పాస్ వస్తుంది. కలెక్షన్ల పరంగా మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను క్రాస్ చేసింది. ఇక ఈమూవీ సక్సెస్ మీట్ ను ఈనెల 18న విశాఖపట్నంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మూవీ భారీ విజయం సాధించడంతో సక్సెస్ పార్టీని గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. కాగా బన్ని త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా కూడా సక్సెస్ కావడం విశేషంగా చెప్పుకోవచ్చు..

- Advertisement -