ఎస్పీ బాలు మృతి పట్ల పవన్‌ సతాపం..

104
pawan

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలు చనిపోయారంటూ మధ్యాహ్నం తన ఆఫీసు సిబ్బంది తనకు చెప్పారని తెలిపారు. కరోనా బారిన పడ్డానని, కోలుకుంటున్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలు చెప్పారని… ఆయన త్వరగా కోలుకోవాలని తాను కూడా ఆకాంక్షించానని చెప్పారు. ఆయన కోలుకోవాలని యావత్ దేశం కోరుకుందని… కానీ, దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమైపోయారని అన్నారు.

బాలుగారిని చిన్నప్పటి నుంచి చూశానని… ఆయనంటే తనకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పారు. ఇలాంటి స్థితిలో ఆయన మృతి చెందడం చాలా బాధగా వుంది అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తునానంటూ ఆయన ఓ వీడియో ద్వారా తన స్పందనను తెలియజేశారు.

JanaSenaParty Chief Sri PawanKalyan garu paid his deep Condolences to Sri S.P.Balasubrahmanyam garu