మొక్కలు నాటిన సినీ నటుడు శేషు..

320
seshu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జబర్దస్త్ శేషు మొక్కలు నాటారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ ఫణి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటానని ఆర్టిస్ట్ జబర్దస్త్ శేషు అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మరో ముగ్గురు ( హీరో కిరణ్ , సినీ నటుడు కోట శంకర్ రావు , జబర్దస్త్ ఆర్టిస్ట్ త్రినాథ్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -