ఎస్పీబీ మృతి పట్ల మహేష్‌,ఎన్టీఆర్‌,చరణ్‌ సంతాపం..

120
mahesh

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు మరణంతో యావత్ దేశం, సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎస్పీబీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మహేష్ బాబు స్పందిస్తూ… బాలుగారు ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ఆయనకు మరే గాయకుడు సాటి రాలేరని అన్నాడు. తమ గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నాడు. బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించాడు.

రాంచరణ్ స్పందిస్తూ… ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే బాలుగారు మరణించారనే వార్తతో షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఆయన లేని లోటును పూడ్చలేమని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పాడు.

జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే’ అని ట్వీట్ చేశారు.