పవన్ @ భవదీయుడు భగత్ సింగ్

342
pawan
- Advertisement -

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ తర్వాత హరిహర వీరమల్లు సినిమా చేయనున్నారు. ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనుండగా ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. పవన్ 28వ సినిమా ఈ మూవీ వస్తుండగా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఖరారు చేశారు.

భవదీయుడు అనే పదంలో ఓ రకమైన వినమ్రత, సౌమ్యం కనిపిస్తోంది. ఈ రెండూ కలిపి టైటిల్ గా మార్చేశారు మేక‌ర్స్. టైటిల్ అభిమానుల‌కి పిచ్చిపిచ్చిగా న‌చ్చేసింది. ఇక ఫ‌స్ట్ లుక్‌లో ప‌వ‌న్ బైక్‌పై కూర్చొని టీ తాగుతూ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి వస్తున్న ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -