మెగా బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ…

151
kavitha
- Advertisement -

తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10వ తేదీన లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మెగా బతుకమ్మ పోస్టర్‌ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత.

బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి నాయకులను కవిత అభినందించారు.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్, స్టేట్ జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, స్టేట్ సెక్రెటరీ రోహిత్ రావు, తెలంగాణ జాగృతి నాయకులు ప్రశాంత్ పూస, నితిష్, రోహిత్ రావ్, దినేష్ రెడ్డి, అనుషా దుర్గా, జితూ, రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -