‘అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బికె’ ఎపిసోడ్ 2 కూడా ప్రస్తుతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకంటోంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో కూడా పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. అందులో ప్రధానంగా తాను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు పవర్ స్టార్ కి ఎందుకు ఆ ఆలోచనలు వచ్చాయి ?, అసలేం జరిగింది ?, లాంటి విషయాలు తెలియాలంటే.. పవన్ మాటల్లోనే తెలుసుకుందాం. ‘నాకు ఉబ్బసం ఉంది. తరచుగా ఆసుపత్రిలో చేరేవాడిని. ఒంటరిగా ఫీలయ్యేవాణ్ణి. 17 ఏళ్ళ వయసులో, పరీక్షల ఒత్తిడి నా డిప్రెషన్‌ను ఇంకా పెంచింది. ఇంట్లో ఎవరూలేని టైంలో మా అన్నయ్య చిరంజీవి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో నాప్రాణం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. ఆ సమయానికి అన్నయ్య నాగబాబు, వదిన చూసి రక్షించారు’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఇదే ఎపిసోడ్ లో బాలయ్య, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. అన్‌స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ పై బాలయ్య ప్రేక్షకులను ప్రశ్న అడగగా అందరు బాలకృష్ణ, పవన్ మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుంటుందని చెప్పారు. బాలయ్య ముందుగా పవన్ తో మల్టీస్టారర్‌కు సంసిద్ధత వ్యక్తం చేయగా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా బాలయ్యతో మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..