పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అత్తారింటికి దారేది. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈసినిమాలో సమంత, ప్రణితలు హీరోయిన్లుగా నటించారు. తాజాగా చిత్రాన్ని తమిళంలో చిత్రకరించారు.
హీరో శింబు కథానాయకుడిగా నటించిన ఈసినిమాలో కేథరిన్ తెస్రా, మేఘ ఆకాశ్ లు హీరోయిన్ లుగా నటించారు. తెలుగులో పవన్ కళ్యాన్ అత్త పాత్రలో నదియా నటించగా తమిళ్ లో రమ్యకృష్ణ నటించిది. అయితే తమిళ్ లో నిన్న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈమూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
శింబు ఓవరాక్షన్ సినిమాకు మైనస్ గా చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు. కథాకథనాల పరంగా ఈ సినిమా పూర్తిగా నిరాశ పరించిందని అక్కడి క్రిటిక్స్ రాశారు. తెలుగులో బంపర్ హిట్ సాధించిన సినిమా తమిళ ప్రేక్షకులను అలరించలేకపోయింది.