మొత్తానికి పవన్ ని మార్చేస్తున్నారు..

205
Pawan Kalyan and Trivikram Srinivas team up for movie, shoot begins ...
- Advertisement -

పవన్‌ సినిమాలకు ఎంత క్రేజ్‌  ఉందో..పవన్‌ చేసే సినిమాలు కూడా అంతే లేట్ అవుతాయి. అటు రాజకీయాల్లో..ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు పవన్‌. అయితే ఈ రెండు పనులను ఒకే సమయంలో హ్యాండిల్‌ చెయ్యలేక…ఏదో ఒక దాన్ని మాత్రం లేట్‌ చేస్తూనే వస్తున్నాడు. దీంతో పవన్‌ అభిమానులంతా ఈ పవర్‌ స్టార్‌ సినిమా కోసం ఎన్ని రోజులైనా వెయిట్‌ చెయ్యడానికి సిద్ధమైపోయారు.

అయితే పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కి పవన్‌ సినిమాల కోసం వెయిట్‌ చేసే పని ఇకనుంచి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే…ఇప్పటినుంచే తన నెక్ట్స్‌ మూవీ కోసం రెడీ ఐపోతున్నాడు పవన్‌. ఇన్నిరోజులు..పవన్‌ ఒప్పుకున్న సినిమాలు సమయం లేక కాస్తంత లేటుగానే తన సినిమాలను కంప్లీట్‌ చేసేవాడు. ఇక పవన్‌ సినిమాలకు దర్శకత్వం వహించే దర్శకులు కూడా తమ సినిమాకోసం ఎప్పుడూ..పవన్‌ ని ఇబ్బంది పెట్టలేదు.
Pawan Kalyan and Trivikram Srinivas team up for movie, shoot begins ...
అయితే ఇప్పుడు పవన్‌ నటిస్తున్న కాటమరాయుడు సినిమా ఇంకా రిలీజ్‌ అవకముందే..పవన్‌ తదుపరి సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయి. కాటమరాయుడి మూవీ అయిపోతుందో లేదో..వెనువెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంకోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్టింగ్  వేస్తున్నారు.

ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మూవీలో పవన్ లుక్ అదిరిపోతుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఐటీ ఎంప్లాయ్ గా కనిపించనున్నాడట పవన్. ఇక కీర్తిసురేష్..అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈమూవీలోనే సీనియర్ నటి ఖుష్బూ నటించనున్న సంగతి కూడా తెలిసిందే. మొత్తానికి క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల

ముందుకురానున్న ఈ సినిమాలో పవన్ ఐటీ ఎంప్లాయిగా నటిస్తాడన్నమాట.. ఇక వెనువెంటనే పవన్ సినిమాలు వస్తుంటే.. ఫ్యాన్స్ కు పండగే. మొత్తానికి ట్రెండ్ సెట్ చేసే పవన్ ట్రెండీగా తయారైతే..అభిమానులకు పండగేగా..!

- Advertisement -