ప్రభాస్‌లా కాదు ….నేను సిన్సియర్

215
rana about baahubali trailer
- Advertisement -

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి-2’ ట్రైలర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఓ సరదా సన్నివేశం ఆవిష్కృతమైంది. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ‘బల్లాలదేవుడు’ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. దీంతో కార్యక్రమ ప్రాంగణలో ఉన్న వారందరి ముఖాల్లో నవ్వులు వెల్లి విరిశాయి.

ఇంతకీ ఆ రిపోర్టర్ ఏం అడిగారంటే.. బాహుబలి పార్ట్-1లో మీకు పాట లేదని మీ ఫ్యాన్స్ ఫీలయ్యారు.. ఈ పార్ట్‌లో మీకు పాట ఉంటుందా? అని ప్రశ్నించగా.. పక్కనే ఉన్న బాహుబలి-2 పోస్టర్ చూపిస్తూ ‘‘ఆ పోస్టర్‌లో అతడిని(బల్లాలదేవుడి క్యారెక్టర్‌లో ఉన్న రానా) చూస్తుంటే సాంగ్స్ చేసేవాడిలా కనిపిస్తున్నాడా? ఒకసారి క్లియర్‌గా చూడండి’’ అంటూ సమాధానం ఇచ్చాడు.

బాహుబలి-1 పాట‌ల్లో రానా డ్యాన్స్ క‌నిపించ‌లేద‌ని అభిమానులు కాస్త నిరుత్సాహ ప‌డ్డార‌ని విలేక‌రి అన్నారు. బాహుబ‌లి-2లోన‌యినా రానా డ్యాన్స్ ఉంటుందా? అని అడిగారు. అమ్మాయిలతో ప్రభాసే డాన్స్ చేస్తాడని, తాను సిన్సియర్‌గా పని చేసుకుంటాన‌ని చ‌మ‌త్క‌రించాడు.

బాహుబ‌లి 2 రిలీజ్ అయిన త‌రువాత‌..అందులో త‌న క్యారెక్ట‌రైజేష‌న్ చూసిన త‌రువాత‌.. త‌న‌కు అస‌లు పెళ్లి చేసుకోవ‌డానికి పిల్ల‌ను ఎవ‌రు ఇవ్వ‌డానికి ముందుకు రారు అంటూ త‌న రోల్ ఎంత ఇదిగా ఉండ‌బోతుంది అనే విష‌యాన్ని చ‌మ‌త్క‌రించారు.

మ‌హా భార‌త యుద్దాన్ని త‌ల‌పించేలా రాజ‌మౌళి తీర్చి దిద్దిన బాహుబ‌లి లో 2 వ భాగం బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ వ‌చ్చెనెల 28న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న బాహుబలి టీం తాజాగా ట్రైలర్‌తో మరింతగా అంచనాలను పెంచేసింది.

- Advertisement -