విద్యుత్ కోతలు లేవన్నది.. వాస్తవమే: జానా రెడ్డి

232
No power cuts in Telangana
No power cuts in Telangana
- Advertisement -

తెలంగాణలో గతంలో కంటే విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చను సీఎల్పీ నేత జానారెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవన్నది వాస్తవమన్నారు. రైతులకు 9 గంటల పాటు కరెంట్ అందిస్తున్నామని అధికారపక్షం చెబుతున్న మాట వాస్తవమని స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ధికి విపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేస్తే తప్పు లేదన్నారు. అప్పులను అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

- Advertisement -