గోవాలోని డబ్ల్యూ రిసార్ట్ వేదికగా సమంత – నాగచైతన్య ల వివాహం మూడు కుటుంబాల మధ్య బ్రహ్మాండంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరు ఒక్కటయ్యారు. సుమారు నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ ప్రేమజంట వేదమంత్రాల సాక్షిగా భార్యా భర్తలయ్యారు.
ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే.. కొత్తదంపతులు సమంత, నాగచైతన్యకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిగ్గా వివాహ సమయానికి వారిద్దరికీ ఉంగరాలు అందేలా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ప్లాన్ చేశారట.
ఊహించని ఈ బహుమతికి వారద్దిరూ ఉబ్బితబ్బిబ్బయ్యారట. ఈ ఉంగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది. మొదట ఈ ఉంగరాలను హైదరాబాదులో నిర్వహించనున్న రిసెప్షన్ లో ఇవ్వాలని భావించారని, అయితే వివాహం సమయానికి ఇస్తేనే బాగుంటుందని భావించి, ఇలా ప్లాన్ చేశారని సమాచారం. అయితే, వైరల్ గా మారిన ఈ వార్తలో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.