అన్నయ్య గ్రీన్ సవాల్‌ను స్వీకరించిన తమ్ముడు..

271
Pawan Kalyan in Haritha Haram
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంను వేగంగా ప్రమోట్ చేయడంలో మంత్రి కేటీఆర్ పెద్ద సక్సెసవుతున్నారు. ఇందులోకి సినీసెలబ్రిటీల్ని లాగడంతో పని ఇంకా వేగంగా వర్కవుటవుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి – సూపర్ స్టార్ మహేష్ బాబు మొక్కలు నాటి మేము సైతం అంటూ బరిలో దిగారు.

Mega Star Chiranjeevi

అంతేకాదు వీళ్లు మరికొందరిని నామినేట్ చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి నరేంద్ర చౌదరి విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించి తన ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత నేరుగా బిగ్ బి అమితాబ్ – మీడియా దిగ్గజం రామోజీరావు – జనసేనాని పవన్ కల్యాణ్ ని నామినేట్ చేశారు.

Pawan Kalyan in Haritha Haram

అన్నయ్య ఇలా పవన్ కి ఛాలెంజ్ విసిరారో లేదో వెంటనే పవన్ రెస్పాండ్ అయ్యారు. ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్నయ్య చిరంజీవి విసిరిన గ్రీన్ సవాల్ ను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వీకరించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మూడు మొక్కలు నాటారు. ఇక బిగ్ బి – రామోజీ కూడా మెగా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కను నాటాల్సివుంది.

- Advertisement -