జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయ సభలు.. ఇటు సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు, పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇటీవల త్రివిక్రమ్‌తో సినిమా మొదలు పెట్టాడు పవన్. ఈ సినిమా అనుకున్న సమయానికి షెడ్యూల్ మొదలైంది. జెట్ స్పీడుతో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కాని ఈ సినిమాకు సంబంధించి మాత్రం ఇప్పటిదాకా ఏ విషయం బయటికి రాలేదు. దీని టైటిల్ కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. దీంతో పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మురిపించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా కి టైటిల్ ఇదేనని సోషల్ మీడియాలో కొన్ని పేర్లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అందులో మొదటగా ఇంజనీర్ బాబు.. గోకుల కృష్ణుడు.. దేవుడే దిగి వచ్చినా.. అంటూ చాలా పేర్లు వినిపించాయి. మొన్నామధ్యన చుట్టేద్దాం రారండోయ్ అనే టైటిల్ కూడా విన్నాం. ఇక లేటెస్ట్ గా మరో కొత్త టైటిల్ ఇదేనంటు ప్రచార సాగుతోంది.
ఈ సినిమాకు “రాజు ఒచ్చినాడు” అని త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వెలువడుతున్నాయి. కానీ అధికారికంగా చిత్ర యూనిట్ ని నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అభిమానుల కోసం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర నిర్మాత రాధాకృష్ణ. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ – అను ఇమ్మాన్యూల్ నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ భారీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. కటమరాయుడు తర్వాత పవన్ తీయబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.