పవన్ హైయెస్ట్ రెమ్యునరేషన్‌ ఇదే!

37
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వినోదాయ సీతమ్ రీమేక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ రైటింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మావయ్య పవన్ తో కలిసి సాయి ధరం తేజ్ ఇందులో మొదటి సారి నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు పవన్ రెమ్యూనరేషన్ ఎప్పటి నుండో హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమా కోసం పవన్ దాదాపు యాబై కోట్లు తీసుకుంటున్నారని టాక్ ఉంది.

తాజాగా పవన్ ఈ సినిమా రెమ్యూనరేషన్ గురించి ఓపెన్ గా చెప్పేశాడు. జనసేన పార్టీ ఆవిర్భావ ఈవెంట్ లో ఇప్పుడు చేస్తున్న సినిమాకు సంబందించి తనకి రోజుకి రెండు కోట్లు ఇస్తున్నారని, 22 రోజులు చేస్తే 40 కోట్లకు పైగా అందుతుందని అదీ తన స్థాయి అని తెలిపాడు. అన్ని సినిమాలకు ఇంత ఇస్తారని కాదు కానీ ఇది మీరు ఇచ్చిందే అంటూ ఫ్యాన్స్ తో చెప్పుకున్నాడు పవన్.

దీంతో పవన్ రెమ్యూనరేషన్ పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ రీమేక్ కి 22 రోజుల డేట్స్ ఇచ్చాడు పవన్. మరో రెండు మూడు రోజులు పెరిగితే రెమ్యూనరేషన్ 50 కోట్లకు చేరుతుంది. అంటే నెలలో పవన్ సంపాదన 50 కోట్లు అన్నమాట. టాలీవుడ్ లో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పచ్చు. తక్కువ రోజులకు పవన్ ఇంత మొత్తం తీసుకుంటూ ప్రభాస్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ లను దాటేసి తన క్రేజ్ చూపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : మరీ ఇలా ఐతే ఎలా ?

పవన్ సినిమా నుండి లీకులు

దసరా కోసం 22 ఎకరాల్లో విలేజ్ సెట్..

- Advertisement -