రైతులకు శాపంగా కాంగ్రెస్…

15
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం.. తెలంగాణలో సాగర్ ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేస్తూ ఆయకట్టు కింద రెండు పంటలకు నీళ్లిచ్చి.. ప్రతి ఏటా లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది. దీనితో వరి, ఇతర ఆరుతడి పంటల సాగుతో దిగుబడి కూడా పెరిగింది.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఎడమ కాల్వకు నీటి విడుదల ఆగింది.ఒకవైపు ఏపీ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగి.. ఇష్టానుసారంగా కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేసుకుంటున్నా చోద్యం చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.మరోవైపు నాగార్జునసాగర్‌ డ్యామ్ ను‌ కృష్ణా రివర్‌ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) కి అప్పజెప్పింది.దీనితో సాగర్ ఆయకట్టు పరిధిలో తెలంగాణ రాష్ట్ర రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారనున్నది.

Also Read:Revanth Reddy: గుంపు మేస్త్రి పాలన.. ఇదేనా?

- Advertisement -