వంద రోజుల బాహుబలి 2..

222
Baahubali 2 Movie 100 days Completed
- Advertisement -

ఏప్రిల్ 28న విడుద‌లైన బాహుబ‌లి ది కంక్లూజ‌న్ చిత్ర ప్ర‌భంజ‌నం మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను సాగింది. ఈ చిత్రం ఇప్పుడు సౌత్ లో ఎన్నో భారీ బ‌డ్జెట్ చిత్రాలు రూపొందేందుకు ఒక స్పూర్తిగా నిలిచిందంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ని తిర‌గ‌రాసింది. మూవీ విడుద‌లై మూడు నెల‌లు కావొస్తున్నా బాహుబ‌లి మానియా ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

Baahubali 2 Movie 100 days Completed
ప్ర‌పంచ వ్యాప్తంగా 1050 స్క్రీన్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసుకొని ఆల్ టైం ఇండియ‌న్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ మూవీ కూడా 50 రోజుల త‌ర్వాత వెయ్యి సెంట‌ర్లలో ఆడింది లేదు.

అయితే వంద రోజులు ఎన్ని సెంట‌ర్స్ లో పూర్తి చేసుకుంద‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి 2 చిత్రం త్వ‌ర‌లో చైనాలో కూడా విడుద‌ల కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం 1600 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు సాధించింది.

- Advertisement -