తెలంగాణ రాజ్యంలో పుట్టి దేశంలోని వివిధ రాజ్యలు తిరిగి చివరికి బ్రిటన్ రాణి కిరీటంలో ఒదిగి పొదిగింది కోహినూర్ వజ్రం. అయితే వలస పాలనకు గుర్తుగా బ్రిటన్ రాజకుటుంబం చేతిలో ఉన్న అరుదైన వజ్రంగా నిలిచింది. నిజానికి వలస పాలిత దేశాల్లో సంపాదించిన విలువైన రత్నాలు వజ్రాలు వస్తువులను బ్రిటన్‌లోని ప్రముఖ హిస్టారిక్ రాయల్ ప్యాలెసెస్ నిర్వహిస్తుంది.
విక్టోరియా మహారాణి కోహినూర్ గురించి వీలునామా రాస్తూ…చార్లెస్ భార్య బ్రిటన్ రాణి కెమిల్లా ధరించాల్సి ఉందని పేర్కొంది. కానీ రాణి కెమిల్లా తప కీరిటంలో కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారని బకింగ్‌హోం ప్యాలెస్ వర్గాలు ఇప్పటకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మే 26న లండన్ టవర్‌లో బ్రిటన్ రాజాభరణాల ప్రదర్శనలో భాగంగా ఈ వజ్రాన్ని విజయ చిహ్నంగా ప్రదర్శించనున్నట్టు ప్రకటించారు. అయితే మే6న చార్లెస్ కెమిల్లా ఆఫిషియల్‌గా పట్టాభిషేకం జరగనుంది. అందులో భాగంగా ఈ పట్టాభిషేక సంవత్సరానికి గుర్తుగా లండన్ టవర్‌లో కిరీట అభరణాల సరికొత్త ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో కోహినూర్‌తో పాటు కలినన్ వజ్రం బ్లాక్ ప్రిన్స్ రూబీతో పాటుగా మరికొన్ని అరుదైన వజ్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని జ్యువెల్ హౌస్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి…