సీఎం..స్వప్నలోక్‌ బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా.!

50
- Advertisement -

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్రినప్రమాదంపై సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలిని అధికారులకు ఆదేశించారు. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్ అలీ, తలసానీ శ్రీనివాస్‌ యాదవ్‌కు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి…

అట్లైతే.. బీజేపీ అడ్రస్ గల్లంతే!

వైరల్ అవుతున్న రాహుల్‌ కామెంట్‌..!

మోదీ దగ్గరకు చరణ్.. 23 నుంచి షూట్

- Advertisement -