- Advertisement -
రాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు రంగారెడ్డి జిల్లా ఎ మ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి.గవర్నర్ తమిళి సై పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించగా సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కేబినెట్‌లో రెండోసారి మం త్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పట్నం. రాష్ట్ర తొలి క్యాబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఫలితాల అనంతరం మహేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్సీగా రెండుసార్లు అవకాశం ఇచ్చింది.
మహేందర్ రెడ్డి 1994, 1999, 2009, 2014లో తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2019 జూన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి మహేందర్‌రెడ్డి గెలుపొందారు.
Also Read:కామారెడ్డి బరిలో రాములమ్మ..నిలబడేనా?
- Advertisement -