నోరు అదుపులో పెట్టుకో: బండిపై పట్నం ఫైర్

230
patnam
- Advertisement -

వికారాబాద్ బీజేపీ సభలో బండి సంజయ్… సీఎం కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. ఏవో రెండు ఎన్నికలు బీజేపీ గెలిచినంత మాత్రాన బండి సంజయ్ అడ్డు ,అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేందర్ రెడ్డి …బీజేపీ తెలంగాణ లో లేనే లేదు…ఎన్నికలకు ఇంకా మూడేళ్లు టైం ఉంది….అపుడు చూద్దాం ఎవరు గెలుస్తారో ?…మీరు ఒక్కటంటే మేము పది అంటాం అన్నారు.

తెలంగాణ ను మిగతా రాష్ట్రాల కన్నా గొప్పగా అభివృద్ధి చేస్తున్న సీఎం కెసిఆర్…బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి ఉందా ?
…బండి సంజయ్ ఒక్కడే హిందువా ?మేము కాదా ?…పీఎం మోడీ హిందువులకే ప్రధానా ?వేరే మతాలకు కాదా ?…బండి సంజయ్ కు ఏ విషయం లోనూ పరిజ్ఞానం లేదు…బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.

- Advertisement -