పీఆర్సీ పై సీఎస్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు

32
CS Somesh Kumar

పీఆర్సీపై సీఎస్ సోమేశ్ కుమార్‌ని కలిశారు ఉద్యోగ సంఘాల నేతలు. అన్ని డిపార్ట్మెంట్ లలో ప్రమోషన్ పక్రియ స్టార్ట్ అయింది ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ప్రమోషన్ పొందారని తెలిపారు మామిండ్ల రాజేందర్. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 11వ వేతన సవరణ సంఘం అందుకుందాం అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు….2 వ వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అవుదాం అని చెప్పారు.

త్వరలోనే ఈ పీఆర్సీ పక్రియ స్టార్ట్ అవుతుంది అని ఆశిస్తున్నామని టీజీవో అధ్యక్షురాలు మమత తెలిపారు.70 శాతం ప్రమోషన్ లు పూర్తి అయ్యాయి….రానున్న కొద్దిరోజుల్లో పూర్తిగా ప్రమోషన్ పక్రియ పూర్తి అవుతుందన్నారు.3వ వారంలో పీఆర్సీ ఉంటుంది అని సీఎం కేసీఆర్ చెప్పారు అందుకని ఇవాళ సీఎస్ ను కలిశాం.కమిటీ నివేదికనే కాకుండా మాతో కూడా చర్చలు జరిపి పీఆర్సీ ప్రకటించాలన్నారు.

సీఎం కేసీఆర్ కూడా మాతో అలానే చెప్పారు.చాలా డిపార్ట్మెంట్ లలో ప్రమోషన్ పక్రియ పూర్తి అయింది.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2 సంవత్సరాల వారికి ప్రమోషన్ ఇవ్వడం తో చాలా మందికి ప్రమోషన్ వస్తున్నాయి.మాతో ప్రభుత్వం సఖ్యతగా నే ఉంది .2,3 రోజుల్లో సీఎస్ పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.