ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలోని హే హలో.. నమస్తే అంటూ కొనసాగే లిరికల్ వీడియో సాంగ్‌ను శనివారం హైదరబాద్‌లోని పాతబస్తీలో వినూత్నంగా విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ పాటల రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్, పాపులర్ దర్శకుడు అనుదీప్ కేవీలు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ ఈ వేడుకకు రావడం ఎంతో సంతోషంగా వుంది. నేను ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఈ చిత్రం క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని బండ్రెడ్డి. ఆయన ప్రతిభ గురించి నాకు తెలుసు. ఆయన దర్శకత్వం వహించిన చిత్ర కూడా త్వరలో రాబోతుంది.
తన దర్శకత్వ అనుభవంతో ఈ సినిమాకు క్రియేటివ్ నిర్మాతగా వున్నాడు. ఈ సినిమా నానికి మంచి పేరును తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఈ చిత్రం అంతా నూతన నటీనటులతో, సాంకేతిక నిపుణులతో ఉన్నతంగా తీర్చిదిద్డబడింది. తప్పకుండా ఈ చిత్రం ఘనవిజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను అన్నారు.జోస్ జిమ్మి సంగీతం కూడా చాలా వినసొంపుగా వుంది. ఆయనకు సంగీత దర్శకుడిగా మంచి భవిష్యత్తు వుంది. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రణవ్ మంచి గాయకుడు, ఈ చిత్రంతో నటుడిగా కూడా మంచి పేరును తీసుకవస్తుంది. మిగతా నటీనటులకు కూడా ఈ సినిమా మైలురాయిగా నిలవాలని కోరుకుంటున్నాను అన్నారు. పాపులర్ దర్శకుడు కేవీ అనుదీప్ మాట్లాడుతూ నాని నాకు మంచి మిత్రుడు. ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ చిత్రం అందరికి మంచి పేరును తీసుకరావాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాతల్లో ఒకరైన సంపత్ మక మాట్లాడుతూ నేను ఈసినిమా చేయడానికి ఒకే ఒక్క కారణం నాని. కేవలం అతని మీద నమ్మకంతో సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వున్న నేను ఈ సినిమాతో నిర్మాతగా మారాను. ఈ పాట విని సినిమా చేయడానికి ఓకే అన్నాను. ఈ పాటతోనే మా జర్నీ ప్రారంభం అయింది. హైదరాబాద్ బ్యూటీని చాటి చెప్పే ఈ పాట హైదరాబాద్ యాంథమ్‌గా నిలిచిపోతుంది అన్నారు. క్రియేటివ్ నిర్మాత నాని మాట్లాడుతూ ఈ సినిమాకు ఇద్దరు హీరోలతో పాటు కనిపించని మరో ఇద్దరు హీరోలు ఈ చిత్ర దర్శకుడు ప్రణీత్, సంగీత దర్శకుడు జోస్ జిమ్మి ఈ చిత్రంతో జోస్ జిమ్మి ని కనీసం ఓ దశాబ్దం గుర్తుపెట్టుకుంటారు అన్నారు. ఈ చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్ నానికి మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పడు టీమ్ అంతా ఎంతో కలత చెందారని, అసలు బతుకుతాడో లేదో అనుకున్ననాని డాక్టర్లను కూడా ఆశ్చర్యపరుస్తూ అతి త్వరలోనే కోలుకుని ఈ రోజు మీ ముందుకు వచ్చాడని, సినిమా మీద వున్న ప్రేమే అతడ్ని బతికించిందని ఎగ్యిక్యూటివ్ నిర్మాత నిఖిల్ కోడూరు తెలిపారు. ఈ వేడుకలో హీరోలు ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్, హీరోయిన్ ప్రీతి పగడాల, సంగీత దర్శకుడు జోస్ జిమ్మి, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!