పరిశ్రమలకు కేరాఫ్‌ పటాన్‌చెరువు..

247
KTR
- Advertisement -

పరిశ్రమలకు కేరాఫ్‌గా పటాన్‌ చెరువు మారిందని తెలిపారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో మౌలిక సదుపాయల కల్పన కేంద్రం,వ్యర్థ జలాల శుద్ది కేంద్రానికి శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ టీఎస్‌ ఐ పాస్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు.

పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కాలుష్య కారకాలైన పరిశ్రమలపై కొరడా విధించామన్నారు. కాలుష్యం కారణంగా భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడకూడదన్నారు. పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించే ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు తరలించే ముందే ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా చూస్తామన్నారు.

కొంతమంది పరిశ్రమల అధిపతులు దుర్మర్గాంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. కొంతమంది పరిశ్రమల అధిపతులతో నేనే స్వయంగా మాట్లాడానని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ ఫార్మా సిటీలో కూడా ప్రపంచ స్ధాయి నాణ్యత ప్రమాణాలు సృష్టించిన తర్వాతే పరిశ్రమలు తరలిస్తామన్నారు. సరైన టైం ఇచ్చి పరిశ్రమలను తరలించే విధంగా చర్యలు చేపడుతామన్నారు. పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలని సూచించారు కేటీఆర్.

- Advertisement -