మ‌రో మాస్ సినిమాతో రానున్నబ‌న్నీ..

314
Allu-Arjun
- Advertisement -

నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏసినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌లేదు. దీనికి కార‌ణం త‌న‌తో క‌మిట్ అయిన ద‌ర్శ‌కులు వేరే సినిమాల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్లే అల్లుఅర్జున్ ఇన్ని రోజులు కాలిగా ఉన్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ విక్ర‌మ్ కుమార్ తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కానీ అది ఇంకా ప్రారంభంకాలేదు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన కొన్ని విష‌యాలు ఫిలిం న‌గ‌ర్లో చక్క‌ర్లు కొడుతున్నాయి.

Allu arjun, vikram kumar

అల్లు అర్జున్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌బోయే సినిమా స్టోరీ కొత్త‌గా ఉంద‌ని స‌మాచారం. ఈమూవీలో అల్లు అర్జున్ కొత్త గెటప్ లో క‌న‌పించ‌నున్నాడ‌ట‌. మాస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా ఈసినిమాను తెర‌కెక్కించ‌నున్నార‌ని ఫిలిం న‌గ‌ర్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇక అల్లు అర్జున్ కు మాస్ ఆడియ‌న్స్ కూడా పెద్ద ఎత్తున ఉండ‌టంతో ఈసినిమాను ఓకే చేశాడు బ‌న్నీ.

Vikram-Kumar

గ‌తంలో బ‌న్ని మాస్ క్యారెక్ట‌ర్ లో చేసిన స‌రైనోడు సినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించింన విష‌యం తెలిసిందే. త‌న త‌ర్వాతి సినిమా పూర్తిగా మాస్ ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుటుంన్నాడ‌ట బ‌న్నీ. ఇప్ప‌టికే ఈసినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వ‌ర్క్ కూడా రెడీగా ఉందని తెలుస్తుంది. ఇక ఈమూవీని శాస‌నం నాగ అశోక్ కుమార్..న‌ల్ల‌మ‌లుపు బుజ్జి సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈమూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇక అల్లు అర్జున్ త‌న త‌ర్వాతి చిత్రాల‌పై కూడా క‌స‌రత్తు చేస్తున్నాడు. ఈమూవీ త‌ర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయ‌నున్నాడు.

- Advertisement -