ప్రయాణం ఉచితం..కష్టాలు అరాచకం!

31
- Advertisement -

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన సంగతి విధితమే. ఆర్టీసీకి సంబంధించిన పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బసుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ హామీ అమలుతోనే అసలు చిక్కు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం ఎక్కడికైనా ఉచితం కావడంతో ప్రతి చోట డిపోలలో మహిళలతోనే రద్దీ వాతావరణం కనిపిస్తోంది. అలాగే బస్సుల్లో కూడా సీట్లను పూర్తి స్థాయిలో మహిళలే ఆక్రమింస్తుండడంతో టికెట్ కొని ప్రయాణిస్తున్న పురుషులు నిలబడి వెళ్లాల్సి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా ఎలాంటి అవసరం లేకున్నప్పటికి కొందరు మహిళకు ప్రయాణానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. .

దీంతో బస్సులో మహిళల మధ్య చిన్న చిన్న ఘర్షణలు వాంగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ కేవలం మహిళల కోసమే అన్నట్లుగా మారడంతో ఉద్యోగ నిమిత్తం ఆఫీస్ లకు వెళ్ళే పురుషులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో తమ బతుకుతెరువు దిన దిన గండంగా మారిందని ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేపడుతున్నారు. ఇక రోజులు గడిచే కొద్ది ఉచిత ప్రయాణం కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా మొత్తం మీద ప్రయాణం ఉచితమైనప్పటికి దాని చుట్టూ ఏర్పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మరి ఈ ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ సర్కార్ ఇలాగే కొనసాగిస్తుందా లేదా ఆర్థిక భారాన్ని భరించలేక హామీ అమలును హోల్డ్ లో వేస్తుందా అనేది చూడాలి.

Also Read:తులసి గింజలతో ఎన్ని లాభాలో..!

- Advertisement -