ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ !

15
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక ఆప్ నేత, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించి సీఎం రేసులోకి వచ్చారు పర్వేశ్ వర్మ. గతంలో ఢిల్లీ సీఎంగా పని చేశారు పర్వేశ్ వర్మ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ.

ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై మూడు వేల ఓట్ల తేడాతో గెలిచారు పర్వేశ్ వర్మ. మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుండి గెలుపొందిన కేజ్రీవాల్ ను ఓడించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.

జాట్ కుటుంబానికి చెందిన పర్వేశ్ వర్మ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసి 2013లో రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. బీజేపీ తరపున 2013 నుంచి 2014 మధ్య మెహ్‌రౌలి నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 2 లక్షల 68 వేల పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు మెజార్టీతో పార్లమెంటులో అడుగుపెట్టాడు. 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కేజ్రీవాల్‌పై గెల్చిన పర్వేశ్ వర్మనే ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది.

Also Read:కేజ్రీవాల్ వల్లే ఓటమి: అన్నా హజారే

- Advertisement -