పరుచూరి వెంకటేశ్వరరావు ఇంట్లో విషాదం..

511
paruchuri
- Advertisement -

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) గుండెపోటుతో ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవారు పరుచూరి వెంకటేశ్వరరావు. టాలీవుడ్‌లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ కాలం మొదలుకొని నేటివరకు కథలు, డైలాగ్స్ రాయడంలో పరుచూరి బ్రదర్స్ (ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌)కి తిరుగులేదు.టాలీవుడ్ అగ్రహీరోలందరి సినిమాలకు రచయితలుగా పని చేసిన అనుభవం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ సొంతం.

- Advertisement -