విరాట్ చెప్పినా ఆర్సీబీ వినలేదు: పార్ధివ్

297
bumra
- Advertisement -

భారత స్టార్ బౌలర్ జస్పిత్ బుమ్రా ఐపీఎల్ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత వికెట్ కీపర్ పార్ధివ్ పటేల్. 2013లో బుమ్రా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వగా తొలిమ్యాచ్‌లో కోహ్లీని ఔట్ చేయడమే కాదు 3 వికెట్లు పడగొట్టాడు.

అయితే వాస్తవానికి బుమ్రా…ఆర్సీబీ తరపునే ఆరంగేట్రం చేయాల్సి ఉండగా ఆర్సీబీ యాజమాన్యం అతడిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని వెల్లడించారు పార్ధివ్ పటేల్. బుమ్రాని వేలంలో కొనుగోలు చేయాలని కోహ్లీ సూచించిన ఆర్సీబీ మేనెజ్‌మెంట్ అంత సీరియస్‌గా తీసుకోలేదని తెలిపాడు.

ఐపీఎల్ ఆరంభ సీజన్ నుండి స్టార్‌ బ్యాట్స్‌మెన్‌లపైనే దృష్టిసారించిన ఆర్సీబీ 2020 వేలంలో మాత్రం తన పంథా మార్చుకుంది. ఫాస్ట్ బౌలర్లు క్రిస్ మోరీస్ (రూ. 10 కోట్లు), కేన్ రిచర్డ్‌సన్ (రూ. 4 కోట్లు), డేల్ స్టెయిన్ (రూ. 2 కోట్లు)లను కోట్లు వెచ్చించి దక్కించుకుంది. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -