ఢిల్లీలో విస్తరిస్తున్న హరిత యజ్ఞం..

293
- Advertisement -

ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాలు ఇప్పుడు పర్యావరణ రక్షణ అన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరుషోత్తం రూపాల. ఢిల్లీలో ఇవాళ ఆయన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని అశోక మొక్క నాటారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణకు చెందిన రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. యువకుడైన ఒక ఎంపీ పర్యావరణ హితమైన కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తం చేయటం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం అయ్యేందుకు అవసరమైన శక్తిని ఆ భగవంతుడు సంతోష్ కుమార్ కు ఇవ్వాలని మంత్రి ఆశీర్వదించారు. తన సహచర కేంద్ర మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తానని ఈ సందర్భంగా రూపాల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్న ప్రతి ఒక్కరు కూడా వాటి రక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు.

పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్ళిన ఎంపీ సంతోష్ కుమార్ వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు హరితహారంతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేలా కృషి చేస్తున్నారు.

- Advertisement -