వైభవంగా ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ..

259
Andal Amma Unjal Seva

యాదాద్రి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఆండాళ్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఉంజల్ సేవ కార్యక్రమాన్ని కన్నులపండుగా నిర్వహించారు. తీరొక్క పూలతో, బంగారు ఆభరణాలతో, తులసి ఆకులతో అమ్మవారిని ముస్తాబు చేసి మాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం బంగారు ఉయ్యాలలో ఉంచి అమ్మవారిని సేవించారు. ముత్తెదువులు అమ్మవారి సెలలో పాల్గొని, మంగళహారతులు స్వీకరించి తరించారు.