బీహార్లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం మద్యపానంను నిషేధించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో గతంలో అక్రమ మద్యం తాగి బిహార్‌లో పలువురు మరణించారు. దీంతో మద్యంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు అక్రమ మద్యం తయారు చేసేవాళ్ల మీద గట్టి నిఘా ఉంచారు. తాజాగా ఆ రాష్ట్రంలోని గయాలో మద్యంను తయారు చేస్తున్న మాఫియాకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు…వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు.
అక్కడే ఉన్న ఒక రామచిలుక పోలీసుల రాకను గమనించి తన యజమాని అయిన అమృత్ మల్లాకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడి నుంచి అమృత్ కుటుంబ సభ్యులతో పారిపోయారు. కానీ సమాచారం ఇచ్చిన చిలుక అక్కడే ఉండిపోయింది. చిలుకను చూసిన పోలీసు ఇన్‌స్పెక్టర్ దాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు.
స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ నిర్వహించారు. మీసర్ అమృత్ ఎక్కడికి వెళ్లాడు? వాళ్లు పాత్రలో మద్యం తయారు చేశారా? అని ప్రశ్నలు అడిగారు. చిలుక నుంచి కటోరా అనే మాట తప్ప ఇంకేం రాలేదు. దీంతో నిందితులను పట్టుకొనే పనిలో ఉండిపోయారు. అయితే చిలుకను స్టేషన్‌కు తీసుకువచ్చిన విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడంతో పోలీసుల తీరు పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…