ఉదయం రాజ్యసభ…సాయంత్రం లోక్‌సభ

131
Parliament Session
- Advertisement -

దేశంలో కరోనా,ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో జనవరి 31 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను పటిష్ట భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ, సెంట్రల్ హాలులో సీట్లు ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ కోసం లోక్‌సభ ఉ. 11 గంటలకు సమావేశమవుతుంది. అనంతరం 2వ తేదీ నుంచి సాయంత్రం లోక్‌సభ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సా. 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు.

- Advertisement -