317 జీవోపై పునరాలోచించాలి: బండి సంజయ్

45
bandi sanjay

జీవో 317పై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నియోజకవర్గ స్ధాయి సమావేశం జరుగగా మాట్లాడిన బండి..తమ పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకే కొత్త వాళ్లకు అవకాశం ఇస్తానని కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తున్నాడన్నారు. జీవో 317పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తాం అన్నారు.

జాతీయ నాయకులతో కలిసి ఉద్యోగ సంఘాల నాయకులతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం అన్నారు. ముందస్తు ఎన్నికలకు పోతామని కేసీఆర్ చెబుతున్నాడు….ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చకుండానే ముందస్తు ఎన్నికలకు ఎలా పోతావని ప్రశ్నించారు బండి సంజయ్.