నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు

7
- Advertisement -

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాలు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు మరో 8 బిల్లులు ప్రవేశ పెట్టనుంది కేంద్రం.

21 రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌పై కేంద్రాన్ని పార్లమెంట్‌ సమావేశాల్లో నిలదీయాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో 8 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఏడు పెండింగ్‌ బిల్లులతోపాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్‌ స్పోర్ట్స్‌ గవర్నెన్స్‌ బిల్లు, జియోహెరిటేజ్‌ సైట్స్‌, జియో రెలిక్స్‌ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్‌ యాండీ డోపింగ్‌ (సవరణ) బిల్లు, మణిపూర్‌ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. మొత్తంగా ఈ పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.

Also Read:ఎస్‌జె సూర్య..’కిల్లర్’ ఫస్ట్ లుక్

- Advertisement -