నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

160
parliament
- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనుండగా ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే అవకాశం ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్,డీజీల్ ధరలపై మోదీ సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి ప్రతిపక్షాలు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకోగా అధికార బీజేపీ కూడా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తర్వాత ఇటీవ‌ల మృతి చెందిన 40 మంది మాజీ స‌భ్యుల‌కు స‌భ నివాళులు అర్పిస్తుంది. ఈ కార్య‌క్ర‌మాల అనంత‌రం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం ప్రారంభం అవుతుంది. ఈ స‌మావేశాల్లో 17 కొత్త బిల్లుల‌తో పాటు, మ‌రో రెండు ఆర్ధిక బిల్లుల‌ను కూడా ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ది. అంతే కాకుండా ఇటీవ‌ల జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌ల‌కు చ‌ట్ట‌రూపం ఇవ్వ‌బోతున్నారు.

- Advertisement -