తొలివన్డేలో ధావన్ సేన గెలుపు..

39
dhawan

శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ధావన్ సేన అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రతిభతో శ్రీలంకను మట్టికరిపించింది. లంక విధించిన 263 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.4 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 263 పరుగులు చేసి విజయం సాధించింది.

కెప్టెన్‌ ధవన్‌ (95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 86 నాటౌట్‌) రాణించగా ఇషాన్‌ కిషన్‌ (42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), ఓపెనర్‌ పృథ్వీ షా (24 బంతుల్లో 9 ఫోర్లతో 43) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. చివరలో సూర్యకుమార్‌ (20 బంతుల్లో 5 షోర్లతో 31 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 రన్స్‌ సాధించింది. కరుణరత్నె (43 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. దీపక్‌ చాహర్‌, చాహల్‌, కుల్దీ్‌పకు రెండేసి వికెట్లు దక్కాయి. కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ , సూర్యకుమార్‌లు ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేశారు.