‘బి-ఫిజ్’ అంబాసిడర్లుగా ప్రియాంక,ఎన్టీఆర్

319
priyanka
- Advertisement -

భారతదేశపు అతిపెద్ద బేవరేజ్ కంపెనీగా ఉన్న పార్లే ఆగ్రో తమ సరికొత్త పానీయం బి-ఫిజ్‌తో భారతదేశంలోని బేవరేజ్ విభాగంలో మరొకసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఆపిల్ జ్యూస్‌తో మిశ్రమమైన ఈ విశిష్ట మరియు రీఫ్రెషింగ్ మాల్ట్ ఫ్లేవర్ సహిత ఈ కార్బోనేటెడ్ డ్రింక్ అన్ని వయసు వర్గాల వినియోగదారుల రుచి అనుభవంలో విప్లవాత్మక మార్పు తీసుకు రావడానికి సిద్ధమైంది. అప్పీ ఫిజ్‌తో ఫ్రూట్ ప్లస్ ఫిజ్ ఆధారిత ఉత్పత్తి శ్రేణిలో అగ్రగామిగా ఉన్న పార్లే ఆగ్రో నుండి ఈ బి-ఫిజ్ ఒక సరికొత్త ఉత్పత్తిగా రానుంది. భారీస్థాయి మార్కెటింగ్, ఆకర్షించే ప్యాకేజింగ్ మరియు ఆకర్షణీయమైన ధర లాంటి అంశాలతో కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ (CSD) విభాగంలో ఈ ఉత్పత్తి గొప్ప ప్రకంపనలు సృష్టించనుంది. ఈ కొత్త ఉత్పత్తిని గరిష్ట స్థాయిలో వినియోగదారులకు దగ్గర చేయడానికి మరియు దీని గురించిన అవగాహన పెంచడానికి జాతీయ స్థాయి బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా-స్టార్ ప్రియాంకా చోప్రా జాన్స్‌ను దక్షిణ భారతదేశపు బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్.టి.ఆర్‌ను ఎంచుకున్నారు.

డ్రింక్ ఫర్ ది బోల్డ్‌గా రానున్న ఈ బి-ఫిజ్ ఒక విశిష్ట, సాహసోపేత మరియు ఉత్తేజకరమైన రుచి అనుభవం అందించనుంది. మాల్ట్ ఫ్లేవర్‌ అందించే గాఢమైన బీర్ రుచికి ఆపిల్ జ్యూస్ అందించే తీయటి రుచి తోడు కావడం వల్ల ఈ డ్రింక్ అన్ని వయసు వర్గాల వారిని ఆకట్టుకోనుంది. అలాగే, మార్కెట్లో లభించే సింథటిక్ ఫిజీ డ్రింక్‌లకు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా కూడా బి-ఫిజ్ నిలవనుంది. దీనికితోడు, దృఢమైన మరియు విలక్షణమైన ఎర్ర రంగు ప్యాకేజింగ్ సైతం ఈ లైట్ అండ్ రీఫ్రెషింగ్ డ్రింక్ తీరును ప్రతిఫలించనుంది. పగలు లేదా రాత్రిలో ఏ సమయంలోనైనా రుచి చూడడానికి ఈ డ్రింక్ సిద్ధంగా ఉంటుంది.

రూ. 40 కోట్ల మార్కెటింగ్ పెట్టుబడులతో, ఒక అత్యున్నత-స్థాయి మార్కెటింగ్ ప్రచారం ద్వారా బి-ఫిజ్‌కు ఒక అత్యద్భుతమైన ఆకర్షణ తీసుకురావడానికి పార్లే ఆగ్రో సిద్ధమైంది. ఇందులో భాగంగా, రెండు కొత్త టీవి ప్రకటనలను సిద్ధం చేసింది. జాతీయ మీడియా కోసం మెగాస్టార్ ప్రియాంకా చోప్రాతో ఒక ప్రకటనను మరియు దక్షిణాది మార్కెట్ల కోసం జూనియర్ ఎన్.టి.ఆర్‌తో ఒక ప్రకటనను ప్రసారం చేయనుంది. ఈ టీవీ ప్రకటనలకు తోడు ప్రభావవంతమైన మరియు వినూత్న రీతిలో ప్రింట్, మొబైల్ మరియు డిజిటల్ ప్రచారాలను కూడా అందుబాటులోకి తేనుంది. అలాగే, ఎంపిక చేసిన టెలివిజన్ కార్యక్రమాలకు సైతం బి-ఫిజ్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. ఐ.పి.ఎల్‌లో భాగంగా హాట్‌స్టార్ మరియు యూట్యూబ్‌లో ఈ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. ఉత్పత్తికి సంబంధించి ఆసక్తి మరియు డిమాండ్ పెంచడం కోసం వివిధ డైరెక్ట్ టూ కన్సూమర్ యాప్‌ల ద్వారా ఈ ఉత్పత్తి శాంపిళ్లను కూడా ఈ బ్రాండ్ భారీగా అందజేస్తోంది. ఈ ఉత్పత్తిని వినియోగదారులకు దగ్గర చేయడం కోసం ఇప్పటికే 96 నగరాల్లో OOHలను సైతం పార్లే ఆగ్రో అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఉత్పత్తి ఆవిష్కరణ సందర్భంగా పార్లే ఆగ్రో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CMO నదియా చౌహాన్ మాట్లాడుతూ,“తమ వినియోగదారుల అనుభవాన్ని మరింత సంవృద్ధం చేయడానికి పార్లే ఆగ్రో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. వినియోగదారుల్లో ఉత్సాహం రేకెత్తించే రుచి మరియు అనుభవాలు అందించడం కోసం సరిహద్దులను విస్తరించడం మరియు నిరంతం శ్రమించడం మాకు ఇష్టం. ఆ ప్రయత్నంలో ఒక భాగంగానే బి-ఫిజ్‌ తీసుకొచ్చాం. ప్రత్యేకించి రూ. 10 ధరతో మార్కెట్లో ఈ ఉత్పత్తికి సాటిలేని స్థానం అందించనున్నాం. ఈ ఆధిపత్యం అనేది లాక్‌డౌన్ తర్వాత మా దృఢమైన పంపిణీ ప్రయత్నాలను మరింత పెంచడానికే కాకుండా, పెద్ద సంఖ్యలో వినియోగదారులకు బి-ఫిజ్ అందుబాటులోకి రావడానికి కూడా సాయపడనుంది.

మా సాఫ్ట్ ఆవిష్కరణకు ఇప్పటికే అనుకూల ఫీడ్‌బ్యాక్ లభించింది. ఈ నేపథ్యంలో, బి-ఫిజ్‌తో మార్కెట్లో గరిష్ట ప్రభావం సృష్టించడానికి మేము అత్యంత ఆతృతతో ఎదురుచూస్తున్నాం” అన్నారు. బి-ఫిజ్ ఇప్పుడు రూ. 10 అనే నమ్మశక్యం కాని ధరతో 160 మి.లీ SKUగా లభించనుంది. విశిష్టమైన అందుబాటు మరియు అధిక-నాణ్యతా ప్యాకేజ్ మాత్రమే కాకుండా, ప్రభావవంతమైన ధరతో కూడా పార్లే ఆగ్రో సత్తా చాటుతోంది. రూ. 10 ధర కారణంగా కంపెనీ విజయవంతంగా భారీ స్థాయిలో ఈ ఉత్పత్తిని విస్తరించడంతో పాటు పార్లే ఆగ్రోకి సంబంధించి అత్యంత వేగంగా విస్తరించే SKUగా ఉంటోంది. రూ. 10 ధరతో బి-ఫిజ్ అనేది మార్కెట్లో లభించే అత్యంత విలువైన ఏకైక మాల్ట్ ఫ్లేవర్ కలిగిన ఫిజీ బేవరేజ్ బ్రాండ్‌గా కూడా ఉంటోంది.

పార్లే ఆగ్రో ఇప్పటికే తన అప్పీ ఫిజ్‌తో ఫ్రూట్ ప్లస్ ఫిజ్ డ్రింక్ విభాగంలో దాదాపు 99% మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. అప్పీ ఫిజ్ అనేది అత్యంత ప్రశంసనీయ బేవరేజేస్‌లో ఒకటిగా ఉండడంతో పాటు నేడు భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కార్బోనేటెడ్ డ్రింక్స్‌లలో ఒకటిగా CSD మార్కెట్లో గణనీయమైన స్థానం సాధించింది. ఇప్పుడు బి-ఫిజ్ రూపంలో కొత్త ఫ్రూట్ ప్లస్ ఫిజ్‌తో మొత్తం CSD విభాగంలో అతిపెద్ద మార్కెట్ వాటా చేజిక్కించుకోవడం ద్వారా దేశంలోని నం. 1 బేవరేజ్ కంపెనీగా మారే లక్ష్యం వైపు అడుగులేస్తోంది.

ప్రియంకా చోప్రా ప్రచారంతో ఈ బ్రాండ్‌ మరింతగా వినియోగదారులకు చేరువవుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. ఈ విషయమై పార్లే ఆగ్రో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CMO నదియా చౌహాన్ మాట్లాడుతూ, “బి-ఫిజ్ ప్రచారంలో ప్రియాంకా చోప్రా భాగం కావడం మాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ప్రియాంకాలోని తెగువ, విలక్షణత మరియు ఆకర్షణ లాంటి విశిష్టతలు మా బ్రాండ్‌ ప్రధాన అంశాలైన సాహసోపేత, ప్రయోగాత్మక మరియు విశిష్టత అనే అంశాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రియంకాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు పాపులారిటీతో CSD మార్కెట్లో మా బ్రాండ్‌కు ఒక ప్రముఖ బేవరేజ్ స్థానం సాధించే లక్ష్యాన్ని చేరుకుంటామని మేము విశ్వసిస్తున్నాము” అన్నారు.

బి-ఫిజ్ గురించి ఆ బ్రాండ్ గ్లోబల్ ఐకన్ ప్రియంకా చోప్రా జోనస్ మాట్లాడుతూ, “పార్లే ఆగ్రోతో నాకు సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. వారి కొత్త బేవరేజ్ బి ఫిజ్ ఆవిష్కరణలో నేనూ ఒక భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రచారం సాహసోపేతంగా, ప్రయోగాత్మకంగా మరియు ఫన్‌గా ఉంది. కొత్త ప్రకటనల రూపొందించే క్రమంలో వారితో ఒక అద్భుతమైన అనుభవం సొంతమైంది. ఫ్రూట్ మరియు ఫిజ్ అనేవి బేవరేజ్ మార్కెట్లో ఒక ఆసక్తికర విభాగంగా ఉంటున్నాయి. అలాగే, మాల్ట్ ఫ్లేవర్‌తో వస్తున్న ఈ బి-ఫిజ్ తప్పకుండా ఒక రీఫ్రెషింగ్ జోడింపుగా ఉంటుంది. త్వరలోనే ఈ డ్రింక్ చాలామందికి ఫేవరెట్‌గా మారుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలనని తెలిపింది ప్రియాంక.

పార్లే ఆగ్రోతో భాగస్వామ్యం కొనసాగడం గురించి సౌత్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ, “పార్లే ఆగ్రో వారి కొత్త ఫ్లేవర్డ్ స్పార్క్‌లింగ్ డ్రింక్ బి-ఫిజ్‌తో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదొక సాహసోపేతమైన, విలక్షణమైన ప్రచారం. ఈ డ్రింక్‌ సాహసోపేత రుచికి నేను దాసోహమైనట్టుగానే వినియోగదారులు కూడా దాసోహమవుతారని ఖచ్చితంగా చెప్పగలను” అన్నారు.

- Advertisement -