మాజీ మంత్రి పరిటాల సునీతకు పితృవియోగం..

392
paritala sunitha
- Advertisement -

మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత ఇంట విషాదం నెలకొంది. సునీత తండ్రి ధర్మవరపు కొండన్న అనారోగ్యంతో ఇవాళ ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నసనకోట ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్‌గా కొండన్న చాలాకాలం పనిచేశారు.

కొండన్న మృతిపట్ల మాజీ సీఎం చంద్రబాబు,లోకేశ్‌ సహా పులువురు నేతలు కొండన్న మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. సునీత గారి తండ్రి కొండన్న గారు మృతి చెంద‌టం బాధాక‌రం. సునీత గారి కుటుంబానికి కొండంత అండ‌గా నిలిచిన కొండ‌న్న మరణం ప‌రిటాల కుటుంబానికి తీర‌నిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, సునీత గారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ‌ సానుభూతి తెలియ‌జేస్తున్నానని లోకేష్ ట్వీట్ చేశారు.

- Advertisement -