చందనవెళ్లి పారిశ్రామిక పార్కుతో ఉపాధిఅవకాశాలు: మంత్రి కేటీఆర్

209
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా షాబాద్ మండలంలోని చందనవెళ్లి – హైతాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలో వెల్‌స్పన్‌ అడ్వాన్స్‌ మెటిరీయల్స్‌(ఇండయా) లిమిటెడ్‌ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేశారు మంత్రి కేటీఆర్.ఈ కంపెనీ ద్వారా 1800 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

చంద న్ వల్లి పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తూ వస్తోందన్నారు మంత్రి కేటీఆర్.ఈరోజు ప్రారంభించిన కంపెనీ ఇక్కడి ప్రగతికి ప్రారంభం మాత్రమే… ఇంకా అనేక కంపెనీలు చందన్వెళ్ళి కి రాబోతున్నాయని తెలిపారు.

ఈ సంవత్సరంలోనే welspun group సుమారు 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నది…మరో నాలుగు కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి…వీటితో పాటు నాలుగు కంపెనీలు ఇక్కడ కంపెనీలు ప్రారంభించేందుకు ఇక్కడ స్థలాన్ని కోరుతున్నాయి.

ఇన్నీ కంపెనీలలో స్థానిక యువతకి ఉపాధి వచ్చేలా కృషి చేస్తాం అన్నారు.స్థానిక యువతకు ఉపాధి కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని…ఈ ప్రాంతంలో 3600 ఎకరాల పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకు స్థానిక ప్రజల సహకారం కావాలన్నారు.

దీంతో ఈ ప్రాంతంలో రూపు రేఖలు మారిపోతాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.చందన్వెళ్ళి పారిశ్రామిక పార్క్ కి అవసరమైన మౌలిక వసతులు, మరిన్ని రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.

పరిశ్రమల కోసం ఈ ప్రాంతంలో 1128 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించగా, ఇందులో టీఎస్‌ఐఐసీ 700 ఎకరాలను కొనుగోలు చేసి పలు సంస్థలకు కేటాయించింది. ఎనిమిది వేల కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో సుమారు 10వేల మందికి ఉపాధి లభించనున్నది.

- Advertisement -