Paris:మానవహక్కుల ఉల్లంఘన ..ఆఫ్రికన్‌ బాయ్‌ని చంపిన పోలీసులు..!

40
- Advertisement -

పారిస్‌లో ఆఫ్రికన్ టీనేజర్‌ను పోలీసులు కాల్చి చంపారు. పారిస్‌ వెస్ట్రన్‌లోని నాన్‌టెర్‌కు చెందిన 17యేళ్ల నహెల్‌ ఎమ్‌ అనే యువకుడిని అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతుంది. ప్రజలు నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో నిరసనకారులను నిరోధించడానికి దేశవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఫ్రాన్స్‌లో వరుసగా రెండవ రోజు నిరసనల పర్వం కొనసాగుతుంది. ఈ నిరసనలతో దేశవ్యాప్తంగా కనీసం 150 మందిని అరెస్టు చేసినట్టు మంత్రి గెరాల్డ్‌ డార్మానిన్ తెలిపారు. ఈ మొత్తం ఘర్షణల్లో 40 కార్లను తగులబెట్టారు. 25 పోలీసులు గాయపడ్డారు. అయితే మరో 2000 మంది పోలీసులను పారిస్‌లో రంగంలోకి దించారు.

Also Read: DevendraFadnavis:సుశాంత్ మర్డర్‌పై కీలక ఆధారాలు..

- Advertisement -