ప్రచార జోరులో ప్రకాష్‌ రాజ్‌..

171

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ బెంగళూరు సెంట్రల్ లో ప్రకాశ్ రాజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Actor Prakash Raj

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పోరాటం ఏ ఒక్క వ్యక్తిపై కాదని చెప్పారు. ప్రజల కోసమే తాను పోరాడుతున్నానని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ప్రజలు గెలిచినట్టని అన్నారు. సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే… ఆ ఓటమి ప్రజలదేనని చెప్పారు. కుల, మతాలకు అతీతంగా, ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని విన్నవించారు.