అసిస్టెంట్ తోనే లవ్‌లో పడింది..

201
Parineeti Chopra finds love in an assistant director

హీరోలు,డైరెక్టర్లు హీరోయిన్ల అందాలకు ఫిదా అయిపోయి వారితో లవ్‌లో పడుతుంటారు. ఇక హీరోయిన్లు కూడా వారితో లవ్‌ లో పడడం కామన్‌. అయితే ఎక్కువగా డైరెక్టర్లు హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపిస్తారని, వారితో డేటింగ్‌లో ఉంటారని పుకార్ల మీద పుకార్లు పుట్టడం వింటూనే ఉంటాం. ఇక డైరెక్టర్లే కాక..సెట్‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు కూడా హీరోయిన్ల‌తో ప్రేమ‌లో ప‌డతారు. కానీ..హీరోయినే ఇప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో ప్రేమలో పడింది.

 Parineeti Chopra finds love in an assistant director
ఆ హీరోయినే పరిణితి చోప్రా. అయితే ప‌రిణీతి ల‌వ్‌స్టోరీ మాత్రం స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంద‌న్న‌ది బాలీవుడ్ గాసిప్ రాయుళ్ల స‌మాచారం.  అవును.. ప‌రిణీతి ల‌వ్‌లో ఉంది. అది కూడా త‌న సినిమాల‌కు ప‌నిచేసిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌తో.

ఇక అన్నీ తానేనంటూ..అసిస్టెంట్‌తో రిలేష‌న్‌షిప్‌లోనూ ఉంది. ఇంత‌కీ ఎవ‌రా అసిస్టెంట్ డైరెక్ట‌ర్? అంటే పేరు.. మ‌నీష్‌. ఇటీవ‌లే కాఫీ విత్ క‌ర‌ణ్ షోలోనూ ఆ పేరు లీకైంది.  లేడీస్ వ‌ర్సెస్ రికీ బాల్, సుధ్ దేశీ రొమాన్స్ సినిమాల‌కు ప‌నిచేసిన‌ప్ప‌టినుంచీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో నడుస్తోంద‌న్న ఊహాగానాలున్నాయి.

అయితే ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు `మాన్ కే హ్ యార్ న‌హిన్‌` సినిమాతో సింగ‌ర్‌గానూ డెబ్యూ ఇస్తోంది. అలాగే `మేరి ప్యారీ బిందు` సినిమా మే 12న రిలీజ్‌కి వ‌స్తోంది. ఇక ఇంత బిజీగా ఉన్నా.. ఈ అమ్మడు మాత్రం తన ప్రియుడు మ‌నీష్‌ని వ‌దిలి క్ష‌ణం కూడా ఉండ‌లేక‌పోతోందట‌.